పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అసలే కెప్టెన్సీ పోయి బాధలో ఉన్న అతని పట్ల అభిమానులు జాలి చూపాల్సింది పోయి హేళన చేస్తున్నారు. "జింబాబర్", "జింబాబర్" అని స్లొగన్స్ చేస్తూ అతని పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. సొంత దేశంలోనే ఇలాంటి ప్రతిఘటన ఎదురవడంతో బాబర్ తలెత్తుకోలేకపోతున్నాడు.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం(ఫిబ్రవరి 23) ముల్తాన్ వేదికగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ జట్ల మధుర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బాబర్ సారథ్యంలోని పెషావర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ముల్తాన్ అభిమానులు అతను డగౌట్ లో కూర్చొని ఉన్న సమయంలో "జింబాబర్" అంటూ నినాదాలు చేశారు. మొదట దీన్ని తేలిగ్గా తీసుకున్న బాబర్ ఆజాం.. పదే పదే అలానే పిలవడంతో కోపంతో ఊగిపోయాడు. తనని ఎగతాళి చేసినందుకుగానూ ఫ్యాన్స్‌పైకి విసిరేస్తానని వాటర్ బాటిల్ పైకెత్తాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Multan fans, this is not done! Don't do this with Babar Azam 💛❌#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/Kh52MMIwGM
— Farid Khan (@_FaridKhan) February 24, 2024
జింబాబార్ పేరు ఎలా వచ్చింది..?
పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుండటంతో భారత్ సహా పలు దేశాలు అక్కడ పర్యటించడానికి ఆసక్తి చూపవు. ఈ క్రమంలో వారు పదే పదే జింబాబ్వే వంటి ఇతర చిన్న దేశాలతోనే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేవారు. ఆ మ్యాచ్ ల్లో బాబర్ ఆజాం సెంచరీల మీద సెంచరీలు చేసేవాడు. అదే పెద్ద జట్లతో మ్యాచ్ అనేసరికి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరేవాడు. దీంతో అతను చిన్న దేశాలపై మాత్రమే స్కోర్ చేయగలడని భావిస్తూ 'జింబాబర్' అనే పేరు పెట్టారు. ఈ పదాన్ని కనిపెట్టింది భారత అభిమానులైనా అనతీ కాలంలోనే పాకిస్తాన్‌లోనూ బాగా పాపులర్ అయ్యింది.