PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ బాబర్ ఆజం చెత్త రివ్యూతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. బ్యాట్ ఎడ్జ్ కి క్లియర్ గా తాకినట్టు తెలిసినా అనవసరంగా విలువైన రివ్యూ వృధా చేశాడని మండిపడుతున్నారు. వెస్టిండీస్ తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బాబర్  వ్యక్తిగత స్కోర్ 8 పరుగుల వద్ద వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఇన్నింగ్స్ 13 ఓవర్ మూడో బంతిని జేడెన్ సీల్స్ ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరాడు. ఈ బంతి బాబర్ అజామ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లో పడింది.బ్యాట్ క్లియర్ గా ఎడ్జ్ అవ్వడంతో అంపైర్ ఔటిచ్చాడు. అయితే బాబర్ మాత్రం రివ్యూ తీసుకొని ఆశ్చర్యానికి గురి చేశాడు. కట్ చేస్తే.. అల్ట్రా ఎడ్జ్ లో బ్యాట్ స్పష్టంగా బంతిని తాకుతున్నట్టు కనిపించింది. దీంతో 8 పరుగుల వద్ద ఈ పాక్ బ్యాటర్ పెవిలియన్ కు చేరాడు. ఇటీవలే సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి ఫామ్ లోకి వచ్చిన బాబర్.. స్వదేశంలో మాత్రం సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్నాడు. 

ALSO READ | Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజ్ లో మహ్మద్ రిజ్వాన్ (51), సౌద్ షకీల్ (56) ఉన్నారు.  వర్షం కారణంగా తొలి రోజు 41.3 ఓవర్ల మాత్రమే సాధ్యమైంది. ఒక దశలో 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా రిజ్వాన్, సౌద్ షకీల్ 97 పరుగుల భాగస్వామ్యంతో పాకిస్థాన్ జట్టును ఆదుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మోటీకి ఒక వికెట్ లభించింది.