జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2024 కోసం పాక్ క్రికెట్ బోర్డు (PCB) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. బాబర్ ఆజం నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును మెగా టోర్నీకి ఎంపిక చేసింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీనియర్లు మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైన 18 మంది సభ్యులలో హసన్ అలీ, సల్మాన్ అఘా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌లను తప్పించి.. మిగిలిన వారిని యథాతదంగా కొనసాగించారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన హరీస్ రవూఫ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు పీసీబీ పేర్కొంది. అతను ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బరిలోకి దిగలేదు. అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, బాబర్ ఆజం, బిలాల్ అఫ్జల్, గ్యారీ కిర్‌స్టన్, మహ్మద్ యూసుఫ్, వాహబ్ రియాజ్ సెలక్షన్ ప్యానెల్ దాదాపు రెండు గంటల పాటు చర్చించి ఈ జట్టును ఎంపిక చేసింది.
20 జట్లు తలపడుతున్న పొట్టి ప్రపంచకప్‌లో 19 దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించగా.. ఆఖరి దేశం పాకిస్తాన్.
టీ20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), సయీమ్ అయూబ్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రీది.
Our fans unveil Pakistan's squad for the ICC Men's #T20WorldCup 2024 in the West Indies & USA 🇵🇰🤩
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
Let's go, team! 🙌#WeHaveWeWill | #BackTheBoysInGreen pic.twitter.com/7nsJwPtyn0