వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పోరాటం దాదాపుగా ముగిసింది. వరుసగా రెండు విజయాలను గెలిచి ఈ మెగా టోర్నీని గ్రాండ్ గా ఆరంభించిన పాక్.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో విమర్శల పాలైంది. సెమీ ఫైనల్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో నిన్న (అక్టోబర్ 27) న సౌత్ ఆఫ్రికాపై మ్యాచ్ ఓడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో సఫారీలు ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ బాబర్ అజామ్ పాక్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ పై అరవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 46 ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హారిస్ రౌఫ్ ఈ ఓవర్లో మూడు పరుగులే ఇవ్వడంతో పాటు ఒక స్టన్నింగ్ క్యాచ్ తో ఎంగిడిని వెనక్కి పంపాడు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా మరో వికెట్ తీస్తే మ్యాచ్ గెలుస్తుంది. అయితే 48 ఓవర్లో మొదటి బంతికి సింగిల్ ఇచ్చిన నవాజ్ ఆ తర్వాత ఒక చెత్త బాల్ వేసి బౌండరీ సమర్పించుకున్నాడు.
మహారాజ్ కొట్టిన ఈ బౌండరీతో సఫారీలు సంబరాలు చేసుకోగా.. బాబర్ అజామ్ కోపంతో బౌలర్ నవాజ్ పై అరిచేసాడు. మ్యాచ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ నవాజ్ మీద చూపించాడు. స్పిన్నర్ ను 48 ఓవర్ లో వేయించడం బాబర్ కెప్టెన్సీలో లోపమైతే.. నవాజ్ మాత్రం ఏం చేయగలడు. మొత్తానికి ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా సహచర ప్లేయర్ ను అరుస్తూ బాబర్ గల్లీ క్రికెట్ ను గుర్తు చేసాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ అజామ్ (50), సౌద్ షకీల్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా మార్కరం(91) రాణించడంతో ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసుకొని సెమీ ఫైనల్ కి చేరువైంది.
Babar Azam in 2021 T20 WC - Nobody should point out finger at one person this should not happen, not in this team...specially Nawaz.
— The Right Wing Guy (@T_R_W_G) October 27, 2023
Babar Azam today#PAKvsSA pic.twitter.com/pnnSiSjyNn