పాక్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందే : సెమీ ఫైనల్ అనేది మ్యాటరే కాదంటున్న బాబర్

పాక్  కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందే : సెమీ ఫైనల్ అనేది మ్యాటరే కాదంటున్న బాబర్

మరో పది రోజుల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా పండగా వాతావరణం నెలకొంది. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు వరల్డ్ కప్ స్క్వాడ్ లను ప్రకటించగా.. అక్టోబర్ 5 నుంచి గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక జట్టు భారత్ కి పయనమవుతుండగా.. పాకిస్థాన్ జట్టు రేపు ఇండియాకి రానుంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ మీడియాతో ముచ్చటించిన బాబర్.. వరల్డ్ కప్ లో తమ అవకాశాలు గురించి చెబుతూ.. ఈ క్రమంలో తమ జట్టుని ఆకాశానికెత్తేశాడు. 

భారత ఆడిన అనుభవం లేకపోయినా పాకిస్థాన్  కాన్ఫిడెన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకరకంగా ఇది ఓవర్  కాన్ఫిడెన్స్ లా అనిపించినా అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఆసియా కప్ లో కనీసం ఫైనల్ కి చేరలేకపోయిన పాక్.. భారత్ లో జరగనున్న వరల్డ్ కప్ గెలవడానికి వచ్చామని బాబర్ బీరాలు పలికాడు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ లో తమ జట్టు  అవకాశాలు గురించి మాట్లాడుతూ..తమకు సెమీ ఫైనల్ వెళ్లడం చాలా చిన్న విషయం అని తెలిపాడు. మొత్తానికి ఇంకా భారత్ కి రాకుండానే, ఇక్కడ పరిస్థితులు అనుభవం లేకుండానే ఇలా మాట్లాడడంతో ఇప్పుడు భారత అభిమానులు బాబర్ పై సెటైర్లు వేస్తున్నారు. మరి బాబర్ చెప్పినట్లు చేస్తాడో, సెమీస్ కి రాకుండా పరువు పోగొట్టుకుంటుందో చూడాలి. 
 
కాగా.. పాక్ నేడు భారత్ కి ఈ రోజు సాయంత్రం 8 గంటలకు హైదరాబాద్ కి చేరుకుంటుంది. ఈ నెల 29 న న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో వార్మప్ మ్యాచ్.. అక్టోబర్ 6 న వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్  నెదర్లాండ్స్ తో ఆడనున్నారు. ఇక అందరూ ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 న జరగనుంది.