పాకిస్తాన్ తొండాట: ముందుగా ప్రకటించిన జట్టులో భారీ మార్పులు

పాకిస్తాన్ తొండాట: ముందుగా ప్రకటించిన జట్టులో భారీ మార్పులు

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా నేడు పాకిస్థాన్ శ్రీలంకతో తలపడాల్సి ఉంది. కొలొంబో ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచుకి పాకిస్థాన్ నిన్న రాత్రే ప్లేయింగ్ 11 ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ఏం చేస్తుందో ఆ జట్టుకే అర్ధం కావడం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ పేసర్లు హారిస్ రౌఫ్, నజీమ్ షా లను దూరం చేసుకొని తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫకర్  జమాన్ ని పక్కన పెట్టి అందరికీ షాకిచ్చింది. ఫకర్ స్థానంలో యంగ్ ప్లేయర్ మహమ్మద్ హ్యారిస్ ఆడుతున్నట్లుగా తెలిపింది. ఇక సౌద్ షకీల్ కూడా ఈ మ్యాచులో బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించింది. 

ప్లేయింగ్ 11 లో మార్పులు
 
శ్రీలంకపై మ్యాచులో తాజాగా పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ అనంతరం కెప్టెన్ బాబర్ తాను ప్రకటించిన ప్లేయింగ్ 11 లో మార్పులు చేసాడు. ఓపెనర్ ఇమాముల్ హక్ పై వేటు వేసి మరో ఓపెనర్ ఫకర్ జమాన్ కి తుది జట్టులో అవకాశం కల్పించారు. ఇక సౌద్ షకీల్ కి జ్వరం అని చెప్పి ఆ స్థానంలో అబ్దుల్ షఫీక్ ని తీసుకున్నామని తెలిపింది. మొత్తానికి అత్యుత్సాహం ప్రకటించిన పాకిస్థాన్ పరువు పోగొట్టుకుంది. గల్లీ క్రికెట్ లాగా ప్లేయర్లను మారుస్తూ తొండాట ఆడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు శ్రీలంక భారత్ తో తలపడిన జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్ రజిత ప్లేస్ లో ప్రమోద్ మధుశన్ వచ్చి చేరగా.. ఓపెనర్ కరుణరత్నే స్థానంలో కుశాల్ పెరీరాకి అవకాశం దక్కింది. మరి ఏ జట్టు గెలిచి భారత్ తో ఫైనల్ ఆడుతుందో చూడాలి.