Viral Video: కుంభమేళాలో క్రికెట్​ ఆడిన బాబాలు

Viral Video: కుంభమేళాలో క్రికెట్​ ఆడిన బాబాలు

బాబాలు..సాధువులు.. సన్యాసులు..అఖాడాలు అంటే ఆధ్యాత్మిక చింతనతో గడుపుతుంటారు.  కుంభమేళా లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే వారు బయట ప్రపంచానికి కనపడతారు. మిగతా రోజుల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతారని చెబుతుంటారు.. 

ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​ రాజ్​ లో ఇప్పటికే ప్రారంభమైన  ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరుగుతుంది.  ఈ కార్యక్రమానికి బాబాలు,, అఖాడాలు.. సాధువులు భారీ సంఖ్యలో వచ్చారు.  ఆధ్యాత్మిక  చింతనతో గడపాల్సిన బాబాలు క్రికెట్​ బ్యాట్​ పట్టి ఔరా అనిపించారు.  ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. వెంటనే సెల్​ ఫోన్​ లో వీడియో రికార్డ్​ చేసి  సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. 

महाकुंभ में बाबा लोग फुर्सत में क्रिकेट खेलते हुए pic.twitter.com/MCHKHFn0h9

— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) February 5, 2025

కుంభమేళాలో వైరల్ బాబాలు ఎక్కువయ్యారు.  ఇప్పటి వరకు వివిధ రకాలుగా జనాల దృష్టిని ఆకర్షించిన బాబాలు.. మరో అడుగు వేపి  ఈ సారి క్రికెట్​ ఆడుతూ వైరల్​ అయ్యారు.  బాబాలు క్రికెట్ ఆడుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. జితేంద్ర ప్రతాప్ సింగ్ (@jpsin1) X లో షేర్ చేసిన వీడియోలో కుంభమేళాలో బాబాలు  సాంప్రదాయ దుస్తులు ధరించి..  క్రికెట్​ ఆడుతూ సిక్స్‌లు మరియు ఫోర్లు కొడుతూ కుంభమేళాకు వచ్చిన భక్తులను ఆకర్షించారు.  కుంభమేళాలో తమ ఖాళీ సమయంలో బాబాలు క్రికెట్ ఆడుతున్నారు.. అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేయబడింది.  ఈ వీడియో వైరల్​ కావడంతో వేల సంఖ్యలో వీక్షించారు. అంతేకాదు  నెటిజన్లు  కామెంట్​ చేశారు.

ALSO READ | Astrology: ఫిబ్రవరి 11న కుంభరాశిలో బుధుడు .. శని కలయిక .. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

దీనికంటే అందమైన చిత్రం ఏముంటుందని ఒకరు కామెంట్​ బాక్స్​ లో  రాయగా... మరొకరు ప్రజలంతా ఎక్కడికి వెళ్లారు..అంతా ఖాళీగా ఉందని మరొకరు రాశారు.  ఇంకొకరు మహా కుంభమేళాలో మహా కుంభ్​ నాగ లీగ్​ జరుగుతుంది సోదరా అని  చమత్కారంగా రాశారు.  మొత్తానికి క్రికెట్​ బ్యాట్​ ను బాబాలు పట్టి గల్లీ క్రికెట్​ కాస్త బాబా క్రికెట్​ గా మారింది.  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది బాబాలుగా మారిపోతున్న అనేక  కథనాలు   మీడియాలో వెలువడ్డాయి.  త్వరలో క్రికెట్​ బాబా కూడా వస్తారేమో చూడాలి.. మరి..