బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం సెంట్రల్ టీమ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జులై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 29న మూసి వేయాల్సి ఉంటుంది. ఈ గేట్ల మూసివేత తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ ఆఫీసర్లు, సెంట్రల్ వాటర్ టీమ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగింది.
ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, నాందేడ్ ఈఈ బన్సోద్, సెంట్రల్ టీమ్ ఈఈ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు ఈఈ చక్రపాణి, డీఈ గణేశ్, ఏఈ రవి, సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.