బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత

బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14  గేట్లను అధికారులు ఎత్తారు.  కేంద్రజలవనరుల సంఘం ఒప్పందం మేరకు  జూలై 1వ తేదీన ఏటా తెరుస్తారు. 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబరు 29న మూసివేస్తారు.  గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద నీరు రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరామ్​సాగర్‌ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తుంది. గేట్లు ఎత్తడంతో  రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్​ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు. అక్టోబర్​29 నుంచి జూన్​30 దాకా మూసి ఉంచుతారు. మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదులుతారు.