రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత బాబుమోహన్. యువత మొత్తం బీజేపీ వైపే నడుస్తోందన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీలో చేరికల కార్యక్రమంలో బాబూమోహన్ పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను బీజేపీలోకి ఆయన ఆహ్వానించారు. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు బాబూమోహన్. సభ్యత్వ నమోదు లక్ష్యాలను.. బీజేపీ అనుకున్న దానికంటే వేగంగా అందుకుంటోందని చెప్పారు బాబూమోహన్. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వంలో పార్టీ.. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోందని చెప్పారు బాబూమోహన్.