
ప్రముఖ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు ఉదయ్ బాబుమోహన్ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆందోల్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు ఉదయ్ .. బాబు మోహన్ కూడా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.
కానీ అధిష్టానం మాత్రం చివరకు బాబుమోహన్ కే టికెట్ కేటాయించింది. దీంతో మనస్థాపానికి గురైన ఉదయ్ ... బీఆర్‌ఎస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక 2014లో బీఆర్ఎస్ లో చేరిన బాబుమోహన్ .. ఆ ఎన్నికల్లో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.