హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. కాగా, బాబూ మోహన్ కొద్ది రోజుల క్రితమే ప్రజా శాంతి పార్టీలో చేరారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.