అయ్యో.. బిడ్డా..  రోడ్డు పక్కన పసిగుడ్డును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు 

అయ్యో.. బిడ్డా..  రోడ్డు పక్కన పసిగుడ్డును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు 
  • నిజామాబాద్ జిల్లా చికిలి గ్రామ శివారులో ఘటన

మాక్లూర్, వెలుగు: ఓ పసిగుడ్డును రోడ్డు పక్కన చెట్లలో వదిలివెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చికిలి గ్రామ పంచాయతీ శివారులో జరిగింది. ఆదివారం తెల్లవారు జామున రోజుల పసిగుడ్డును రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిపోయారు. ఉదయం వాకింగ్​కు వెళ్లేవారు శిశువు ఏడుపు విని అటువైపుగా వెళ్లి చూశారు.

చెట్ల మధ్యలో ఆడబిడ్డ కనిపించడంతో గ్రామ కార్యదర్శికి తెలిపారు. అతను స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లి శిశువును తీసుకుని చికిత్స నిమిత్తం అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ గంగాధర్ తెలిపారు.