కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జననం

జగిత్యాల జిల్లా కోరుట్లలో అరుదైన ఘటన జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాబు 24 వేళ్లతో జన్మించిండు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఎరగట్లకు చెందిన సుంగారపు  రవళికి నొప్పులు రావడంతో  కాన్పు కోసం మొదట మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్లర్టు ఆమెకు నార్మల్ డెలివరీ చేయడంతో  మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు ఒక్కో చేతికి ఆరు వేళ్లు, ఒక్కో కాలుకి  ఆరు వేళ్లు  మొత్తం 24 వేళ్లు ఉన్నాయి.

ప్రస్తుతానికి తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. లక్షల్లో ఒక్కరికి ఇలా అరుదుగా జరుగుతుందన్నారు. ఇలా జరగడం మెడికల్ బాషలో  పాలీడాక్టిలీ కండిషన్  అంటారని తెలిపారు. దీని వల్ల  కొందరికి గుండెల్లో రంధ్రం ఉండటం కూడా జరుగుతుందన్నారు. ఇది వంశపారం పరియంగా లేదా మేనరికం వల్ల  జరుగుతుందన్నారు. నార్మల్ డెలివరీని చేసిన ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు డాక్టర్లు.