నిర్మల్‎లో అమానవీయ ఘటన.. చెత్త వాహనంలో పసికందు డెడ్​బాడీ

నిర్మల్‎లో అమానవీయ ఘటన.. చెత్త వాహనంలో పసికందు డెడ్​బాడీ

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త వాహనంలో పడేశారు. మున్సిపల్ కార్మికులు ఎప్పటి లాగే చెత్తను డంపింగ్ యార్డ్‎కు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఓ కవర్ కింద పడింది. గమనించిన కార్మికులు కవర్ తీసి చూసే సరికి ఆడ శిశువు డెడ్​బాడీ కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసికందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.