
మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం గుడిమల్కాపూర్ లోని మదీన్ మసీదు వద్ద గురువారం ఉదయం 5 నెలల జింక పిల్ల ప్రత్యక్షమైంది. అప్పటికే కుక్కలు వెంట పడడంతో స్థానికులు జింక పిల్లను రక్షించి, డయల్100కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసిఫ్నగర్పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జింకను స్థానికుల సహాయంతో సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే, ఈ జింక పిల్ల ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.