డెలివరీ అయిన కొద్దిసేపటికే శిశువు మృతి.. హైదరాబాద్​ ప్రశంస ఆస్పత్రిలో ఘటన

డెలివరీ అయిన కొద్దిసేపటికే శిశువు మృతి.. హైదరాబాద్​ ప్రశంస ఆస్పత్రిలో ఘటన

అల్వాల్, వెలుగు: డెలివరీ అయిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందిన ఘటన అల్వాల్ ప్రశంస ఆస్పత్రిలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన సోనీ నిండు గర్భిణి. గర్భం దాల్చినప్పటి నుంచి రెగ్యులర్​చెకప్ ల కోసం అల్వాల్​ప్రశంస హాస్పిటల్​కు వస్తోంది. 

ఆదివారం (March 17) మధ్యాహ్నం పురిటి నొప్పులు మొదలవడంతో కుటుంబ సభ్యులు ప్రశంస ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు డెలివరీ చేయగా, సోనీ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికే శిశువు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయాడని సోనీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

అల్వాల్​రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకు దిగారు. పెండ్లయిన ఏడేండ్ల తర్వాత గర్భం దాల్చడంతో తాము ఎంతో ఆనందించామని, డాక్టర్ల నిర్లక్ష్యంతో పుట్టిన శిశువును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.