కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. పసికందు అపహరణపై సీసీ కెమెరాలను పరిశీలించారు.
పంజాబీ డ్రెస్ వేసుకున్న గుర్తు తెలియని ఓ మహిళ.. పసికందును ఎత్తుకుని ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.దీంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.