చాలా జంతువులు కొండెక్కి మేయటం సహజమే. అయితే, ఓ మేక పిల్ల ఎలా ఎక్కిందో కానీ 100అడుగుల కొండను ఎక్కింది. ఎక్కడం అయితే ఎలాగో అలా ఎక్కేసింది కానీ, దిగటం తెలీక 3రోజులు కొండపైనే విలవిలలాడింది.ఎట్టకేలకు రెస్క్యూ టీమ్ జోక్యంతో సురక్షితంగా కొండ కిందకు చేరింది మేక పిల్ల. 100అడుగుల ఎత్తున్న ఆ కొండను మేకపిల్ల ఎలా ఎక్కగలిగిందంటూ ఆశ్చర్యపోయింది రెస్క్యూ టీమ్. కొండ దిగే ప్రయత్నంలో మేక పిల్ల కాలికి గాయం కూడా అయ్యింది.
ఐర్లాండ్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐర్లాండ్ లోని గ్రీన్ క్యాజిల్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. కొండ దిగలేక మూడురోజుల పాటు కొండపైనే ఉందని స్థానికులు అంటున్నారు. మేక పిల్ల కాలికి అయిన గాయం అది దిగే ప్రయత్నంలో అయ్యిందా లేక ఇంకేమైనా కారణం ఉందా అనేది క్లారిటీ లేదని రెస్క్యూ టీమ్ అంటున్నారు. గాయపడ్డ మేకపిల్లను దగ్గర్లోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు మేకపిల్ల ఐరిష్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ అనే స్వచ్చంద సంస్థ రక్షణలో ఉంది.