బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఆమధ్య ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ఈ ఫోటోషూట్ లో వరుణ్ తోపాటు బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంది. ఈ ఫోటోషూట్ కోసం ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫోటోపై కాంట్రవర్సీ అయ్యింది. దీంతో కొందరు పెళ్లైన హీరోయిన్ తో ఇలా ముద్దుల ఫోటోలకి పోజులివ్వడమేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయంపై హీరో వరుణ్ ధావన్ స్పందించాడు. ఇందులోభాగంగా తన ప్రొఫెషన్ లో భాగంగా ముద్దు ఫొటోలకి పోజులిచ్చామని అందులో ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. కియారా అద్వాని మంచి నటి మాత్రమే కాకుండా తనకి గుడ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అలాగే పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషినల్ లైఫ్ ని కలిపి చూడకూడదని ఇందులో దేని ప్రాధాన్యత దానికి ఉంటుందని కాబట్టి ఇకనైనా ఈ కిస్ ఫోటోలపై ట్రోలింగ్ ఆపాలని కోరాడు.
ఈ విషయం ఇలా ఉండగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమా క్రిస్మస్ పండగ సందర్భంగా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ కి జంటగా కీర్తి సురేష్ నటించగా ప్రముఖ తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు.