![గోడ కూలి తల్లి కడుపులోనే శిశువు మృతి](https://static.v6velugu.com/uploads/2023/07/Baby-life's-ends-in-mother's-womb-due-to-Wall-collapsed_g3i9uxlt1z.jpg)
మెదక్ పట్టణంలోని మిలటరీ కాలనీలో గురువారం తెల్లవారు జామున ఇల్లు కూలి గర్భిణి తీవ్రంగా గాయపడగా, కడుపులోనే శిశువు చనిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న సర్వర్,ఆయన భార్య చాంద్ సుల్తానా, వీరి కూతురు, ఎనిమిది నెలల గర్భిణి అయిన యాసిన్ బేగంపై ఇంటి పెంకులు, మట్టి పడ్డాయి.
యాసిన్ బేగం పొట్టమీద పెంకులు పడటంతో.. చికిత్స కోసం మెదక్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా, అప్పటికే కడుపులోనే శిశువు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసి మృత శిశువును బయటికి తీశారు.