Vaishnavi chaitanya: వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న బేబీ సినిమా బ్యూటీ..

‘బేబీ’ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది  అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావని కొందరు అంటుంటే.. ఈమె మాత్రం టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని ప్రూవ్ చేస్తోంది.  షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌తో  మొదలుపెట్టిన కెరీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.  కథాబలంతో పాటు  ఇంపార్టెన్స్ ఉండే పాత్రలనే ఎంచుకుంటోంది వైష్ణవి చైతన్య. తెలుగుతో పాటు  తమిళ, కన్నడలోనూ వరుస చాన్సెస్ దక్కించుకుంటోంది. 

ఇప్పటికే  రెండు తమిళ, కన్నడ సినిమాలకు వైష్ణవి సైన్ చేసింది. అలాగే  సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌‌గా ఉండే  ఈమె.. తనకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా లంగా ఓణీలో పదహారణాల తెలుగు అమ్మాయిలా వైష్ణవి పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.