బేబీ(Baby) సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) స్టార్‌గా మారిపోయింది. నెట్టింట ఎక్కడ చూసినా ఈ యంగ్ బ్యూటీనే దర్శనమిస్తోంది. దాంతో పాటుగా ఈ సినిమాలో వైష్ణవి బారాత్ డ్యాన్స్ కూడా వైరలవుతోంది.
దసరా సినిమాలో కీర్తి సురేష్ పెళ్లి బారాత్‌లో వేసిన స్టెప్పులు ఎంత పాపులర్‌గా మారాయో తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వైష్ణవి డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కీర్తి సురేష్ డ్యాన్స్ క్లిప్పింగ్‌ను బేబీ సినిమా క్లిప్పింగ్‌తో కలిపి వైరల్ చేస్తున్నారు. ఈ హీరోయిన్ ఫ్యాన్స్ మాత్రం కీర్తికి ఏమాత్రం తీసిపోకుండా అదరగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బేబీ హిట్‌తో ఈ మూవీ టీం జోష్‌లో ఉంది. తొలి సినిమాకే వైష్ణవి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మరి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందోనని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.