బేబీ(Baby) సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya). సక్సెస్ మాత్రమే కాదు తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సినిమా చుసిన చాలా మంది వైష్ణవి చైతన్య నటనకు ఫిదా ఐపోతున్నారు. ఇంత హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్ ను చాల ఈజీ గా చేసేసింది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన సినిమా జీవితం, తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. నాకు చిన్నప్పటినుండి నటన అంటే చాలా ఇష్టం. అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. చిన్న అవకాశాన్ని కూడా వాదులోకోలేదు. అందులో భాగంగా ఒక ఈవెంట్ లో డాన్స్ చేయడానికి వెళ్తే రూ.700 ఇచ్చారు. అది నా మొదటి సంపాదన. ఆ తరువాత అంతకంటే ఎక్కువ తీసుకున్నా కానీ.. ఆ ఏడువందలు నాకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.
ఇక బేబీ సినిమా లో వైష్ణవి చైతన్య చేసిన బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ పై మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటని యాంకర్ అడగగా.. ఆ సీన్స్ చేసేటప్పుడు టీం నాకు చాలా కంఫర్ట్‌గా నిలిచింది. సినిమాలో ఇన్వాల్స్ అయి చూస్తే ఆ సీన్స్ ఎవరికీ గుర్తుండవు. ఆడియన్స్ లాగే మా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్యకి సంబందించిన ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.