
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ బేబీ(Baby). దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh) తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడంతో.. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాకైంది.
తాజాగా సమాచారం ప్రకారం బేబీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆడియన్స్ బేబీ సినిమాను మరోసారి చూడటానికి రెడీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ దక్కనుందో చూడాలి.