బేబీ దర్శకునికి బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చిన నిర్మాత

టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం అందుకున్న మూవీ బేబీ(Baby). ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించగా.. శ్రీనివాస కుమార్(SKN) నిర్మించారు. చాలా కాలం తరువాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో బేబీ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇటీవలే 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా.. కేవలం 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించడంతో.. నిర్మాత SKN దర్శకుడు సాయి రాజేష్ కు ఖరీదైన బ్రాండ్ న్యూ మోడల్ బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.