Baby Movie Review : ఆడియన్స్ గుండెలపై బలమైన ముద్ర వేసే బేబీ

Baby Movie Review : ఆడియన్స్ గుండెలపై బలమైన ముద్ర వేసే బేబీ

ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), విష్ణవి చైతన్య(Vaishnawi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ(Baby). కలర్ ఫోటో(Color photo) సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అంతేకాదు.. బేబీ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా జులై 14 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. 
 
కథ: వైష్ణవి (వైష్ణవి చైతన్య) బస్తీ నివసించే అమ్మాయి. ఆమెకు ఎదురింట్లో ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అంటే  వైష్ణవికి చాలా ఇష్టం. ఆనంద్ కు కూడా విష్ణవి అంటే చాలా ఇష్టం. అయితే.. ఆనంద్ టెన్త్ ఫెయిల్ కావడంతో ఆటో డ్రైవర్ గా చేయాల్సి వస్తుంది. వైష్ణవి మాత్రం ఇంజనీరింగ్ చేయడానికి కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. మరి విరాజ్ రాకతో వైష్ణవి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? వాటి వల్ల ఆనంద్ కు ఎదురైనా పరిస్థితి ఏంటి? వైష్ణవి.. ఆనంద్, విరాజ్ ఇద్దరిలో ఎవరిని ప్రేమించింది? అనేది మిగిలిన కథ. 
  
విశ్లేషణ: స్కూల్, కాలేజ్ బ్యాక్ డ్రాపు లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బేబీ సినిమా చూస్తే ఆ సినిమాలన్నీ గుర్తుకువస్తాయి. ఆ సినిమాలోని బలమైన పాయింట్స్ అండ్ హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్లను ఈ సినిమా కోసం తీసుకున్నారు దర్శకుడు సాయి రాజేష్. ప్రజెంట్ జనరేషన్ చాలా మంది ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు.

ఇంటర్వెల్ ముందు వరకు సో సో గా సాగిన బేబీ కథ.. ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలైంది.  ఇద్దరు అబ్బాయిల మధ్య  హీరోయిన్ పడిన మానసిక సంఘర్షణ నెక్స్ట్ లెవల్లో చూపించారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ కి ఆడియన్స్ విజిల్స్ వేయడం ఖాయం. ఆ తర్వాత కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించడం ఖాయం. 

నటీనటులు: బేబీ సినిమాలో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి. ఈ సినిమాతో ఆమె తెలుగులో మంచి పేరు సంపాదించుకోవడం ఖాయం. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది వైష్ణవి. ఓవైపు బస్తీ అమ్మాయిగా, మరో వైపు కాలేజ్ స్టూడెంట్ గా ఆమె చూపించిన వేరియేషన్స్ నెక్స్ట్ లెవల్. రెండు పాత్రల్లో జీవించింది వైష్ణవి. ఈ బేబీ పాత్రలో వైష్ణవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.

ఇక ఆనంద్ దేవరకొండ కూడా చాల సహజత్వం కనిపించారు. ఎమోషనల్ సీన్లలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆనంద్ దేవరకొండకు నటుడిగా ఇది బెస్ట్ సినిమా అవుతుంది. ఇక విరాజ్ అశ్విన్ కూడా తన పాత్ర మేరకు చాల బాగా నటించారు. రిచ్ ఫ్యమిలీ కి చెందిన యువకుడిగా విరాజ్ చక్కగా కనిపించారు. ఎమోషన్స్ కూడా బాగా పలికించారు. 

అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హాత్తుకునే బలమైన సంభాషణలు, ఎమోషనల్ మ్యూజిక్.. కలిపి బేబీ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిపాయి

ఇంకా మొత్తంగా చెప్పాలంటే.. బేబీ సినిమా ఆడియన్స్ గుండెలపై బలమైన ముద్ర వేస్తుంది.