చిన్న పిల్లలకు గోర్లు కట్ చేయాలంటే చాలామందికి భయం. కట్ చేసేటప్పుడు కాస్త అటు.. ఇటు.. కదిలించినా గోరుతోపాటు చర్మం కూడా కట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ఎలక్ట్రిక్ బేబీ నెయిల్ కట్టర్ వాడితే.. సరిపోతుంది. దీంతో బేబీ గోర్లను చక్కగా ట్రిమ్ చేయొచ్చు. కెమైల్స్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ కట్టర్ రెండు ఏఏ బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనికి 4 అడ్జస్టబుల్ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి.
దీంతో గోర్లను ట్రిమ్ చేయడంతోపాటు పాలిష్ కూడా చేయొచ్చు. దీంతోపాటు ప్రత్యేకంగా 6 రకాల గ్రౌండింగ్ హెడ్స్ ఇస్తున్నారు. వయసుని బట్టి గ్రౌండింగ్ హెడ్స్‌ని ఎంచుకోవాలి. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. చీకట్లో గోర్లు ట్రిమ్ చేసేందుకు వీలుగా దీనికి ఒక ఎల్ఈడీ లైట్ కూడా ఇచ్చారు.