పుచ్చకాయ పరీక్షలో.. US ప్రెసిడెంట్ పేరు చెప్పేసిన బేబీ హిప్పో

పుచ్చకాయ పరీక్షలో.. US ప్రెసిడెంట్ పేరు చెప్పేసిన బేబీ హిప్పో

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ప్రపంచంలో ఆసక్తికరమైన విషయం. థాయ్‌లాండ్‌లోని ఓ బుజ్జి హిప్పో పోటస్ యూస్ ఎలక్షన్  లో గెలవబోయే అభ్యర్థి ఎవరో అని చెప్పేసింది. అది కూడా ఓ పుచ్చ కాయతో. చోన్‌బురిలోని ఖావో ఖీవ్ లోని ఓపెన్ జూలో ఉన్న మూ డెంగ్ అనే బేబీ పిగ్మీ హిప్పో గతకొద్దిరోజులుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎందుకంటే ప్రపంచంలోనే అది అత్యంత పొట్టి హిప్పో పోసట్. అయితే నవంబర్ 4న జూలో దానికో పరీక్ష పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

 

Also Read :- అమెరికా, ఇండియాల మధ్య టైం డిఫరెన్స్ ఇదే.. US ప్రెసిడెంట్ పోలింగ్ వివరాలు

జూ సిబ్బంది రెండు పుచ్చకాయలు తీసుకొని వాటిపై కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ల పేర్లు రాసి బేబీ హిప్పో ముందు ఉంచారు. మూ డెంగ్ ఏ పేరున్న పుచ్చకాయ తింటే ఆ వ్యక్తి గెలుస్తాడని నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ ఉన్నవారంతా ఎంతో ఆసక్తిగా మూ డెంగ్ ఎవరి పుచ్చకాయ తింటుందో అని ఎదురుచూస్తున్నారు. అది రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేరున్న పుచ్చకాయను తినడానికి వచ్చింది. డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పేరు రాసి ఉన్న పుచ్చకాయను దాని తల్లికి తినిపించారు. ఈ పుచ్చకాయ టెస్ట్ లో లాగే బయట వచ్చిన సర్వేలు కూడా ట్రంపే గెలుస్తాడని చెప్పాయి. దీంతో ఈ బేబీ హిప్పో చెప్పిన జోతిష్యం ఇప్పుడు వైరల్ గా మారింది.