శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో దారుణం జరిగింది. వీధికుక్కలు దాడిలో సాత్విక అనే ఏడాదిన్నర పాప మృతి చెందింది. ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి మరణించింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
కుక్కల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీధి కుక్కల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయన్న కేంద్రం మూడు ప్రధాన అంశాలపై గెజిట్ రిలీజ్ చేసింది. వీధికుక్కలపై మున్సిపల్ సిబ్బంది, వెటర్నరీ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సర్టిఫైడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో కుక్కలకు ఆపరేషన్ తో పాటు కుక్కల అబ్జర్వేషన్ కోసం ప్రత్యేక కెనాల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాటన్నింటిని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయాలని ఆదేశించింది.
కుక్కల దాడికి గురైన వారిని పది రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలని సూచించింది. కరిచిన కుక్కుకు రెబీస్ ఉందా లేదా అని టెస్టు చేయాలని ఆదేశించింది. గత రూల్స్ ను మున్సిపాలిటీలు, అధికారులు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్రం. రూల్స్ పాటించకపోయినా.. కుక్కలు దాడి చేసినా దానికి మున్సిపల్ అధికారులదేనని హెచ్చరించింది.