ఎమ్మెల్సీ తాత మధుపై బేబీ స్వర్ణకుమారి హాట్ కామెంట్స్

ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ అసమ్మతి నాయకురాలు బేబీ స్వర్ణకుమారి కీలక కామెంట్లు చేశారు. ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు చప్రాసిగిరి చేసి ఎమ్మెల్సీ పదవి పొందారని వివాదాస్పద కామెంట్స్ చేశారు. పెగ్గులో మందు పోసి పదవి పొందారని స్వర్ణ కుమారి ఆరోపించారు. పాలేరు నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి పదవి పొందారని, దమ్ముంటే స్వగ్రామంలో వార్డు మెంబర్ గా గెలవాలని సవాల్ విసిరారు. శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అర్హత తాత మధుకు ఎక్కడుందని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.