వెరైటీ ఊయల.. జోల పాట పాడుతది.. పిల్లల్ని నిద్రపుచ్చుతది

వెరైటీ ఊయల.. జోల పాట పాడుతది.. పిల్లల్ని నిద్రపుచ్చుతది

పిల్లల్ని లాలించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్​. ముఖ్యంగా వాళ్లను నిద్రపుచ్చడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి పిల్లల కోసమే ఈ ఎలక్ట్రిక్​ ఊయల. దీన్ని ‘బేబీ టెడ్డీ’ తీసుకొచ్చింది. ఇందులో బేబీని పడుకోబెట్టి.. బటన్​ నొక్కితే ఊయల ఆటోమెటిక్​గా ఊగుతూ.. జోల పాట కూడా పాడుతుంది. ఇందులో మొత్తం 4 స్వింగ్ మోడ్స్​ ఉంటాయి.  పిల్లల వయసుని బట్టి వాటిని అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. 

బిడ్డకు ఇష్టమైన ఫ్రీక్వెన్సీలో వినిపించే 12 మ్యూజిక్​ ట్యూన్స్​ కూడా ప్రీలోడెడ్​గా వస్తాయి. దీన్ని రిమోట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ బటన్స్​, బ్లూటూత్​ ద్వారా ఫోన్​కి కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని వాడుకోవచ్చు. స్వింగింగ్​ టైంని 8, 15, 30 నిమిషాల వరకు సెట్​ చేసుకోవచ్చు. సెట్​ చేసుకున్నంత సేపు ఊగి, ఆగిపోతుంది. దీన్ని యూఎస్​బీతో కూడా చార్జింగ్​ పెట్టుకోవచ్చు. ఫోన్​ని బ్లూటూత్​తో కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఊయలకు ఉండే స్పీకర్​లో రైమ్స్​, పాటలు ప్లే చేయొచ్చు.