
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 27 వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయిచింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మార్చి 14, 16న అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు. అసెంబ్లీ ఛాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, భట్టి, శ్రీధర్ బాబు,పొన్నం, బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి,బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
మార్చి 12న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం,సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు,యువతకు ,రైతులకు పెద్ద పీఠ వేస్తున్నామని చెప్పారు. రైతుల అభివృద్దికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read :- ప్రజావాణికి 15 నెలల్లో 53 వేల ఫిర్యాదులు.. 66 శాతం పరిష్కారం
అభివృద్ధి,ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ప్రజల కల సాకారానికి ఈ బడ్జెట్. వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది. ప్రజలే కేంద్రంగా పరిపాలన జరుగుతోంది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. 25 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం అని జిష్ణు దేవ్ వర్మ అన్నారు.