బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించారు. అయితే ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. సభ పనిదినాలు, అజెండాపై స్పష్టత ఇవ్వడం లేదని వాకౌట్ చేసినట్లుగా హరీష్ రావు తెలిపారు. సభ 15 రోజులు నడపాలని అడిగామని, కానీ మీరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని సీఎం అనడంతో వాకౌట్ చేశామని హరీష్ రావు అన్నారు.
ప్రభుత్వం శుక్రవారం వరకు నడపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.