బచ్చన్నపేట, వెలుగు : కొందరు దుర్గమ్మ ఆలయ స్థలాన్ని అక్రమించుకోడానికి ప్రయత్నస్థున్నారని బచ్చన్నపేట గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ జనగామ జిల్లా బచ్చన్నపేట పట్టణంలోని స్థానిక హైస్కూల్‌కు ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీకి చెందిన ఐదెకరాల స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులకు ఇవ్వగా, దానికి బదులుగా స్థానిక పోలీసుస్టేషన్, గ్రామపంచాయతీకి ఎదురుగా వారికి ఉన్న మూడెకర స్థలాన్ని గ్రామపంచాయతీకి ఇచ్చారు.
589/ఏ సర్వే నెంబర్లోని ఆ స్థలంపై తరుచూ గొడవ చేయడంతో కోర్టుకు వెళ్లగా గ్రామపంచాయతీకే చెందినదని 2015లో కోర్టు తీర్చు ఇచ్చింది. పదేళ్ల కిందనే ఆ స్థలంలో దుర్గమ్మ ఆలయం నిర్మించామని చెబుతున్నారు. అయితే ఆలయ పరిసరాల్లోని ఖాళీ స్థలాన్ని అప్పటి కుటుంబ సభ్యులు ఇప్పుడు వచ్చి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎవరికీ తెలియకుండా పంచాయతీ భూమిని కొలతలు వేసి రిపోర్టు ఇచ్చిన ఎంసీ ఏడీని విధులనుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.