
- చక్రధర్ ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు
- తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు
జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రగతినగర్ సాయి పార్క్‌వ్యూ అపార్ట్మెంట్లో ఉంటున్న చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదు చేశారు. గతంలో చక్రధర్ తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని, ఇందుకు కారణం హరీశ్‌రావు, రిటైర్డ్పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుతో పాటు మరికొందరు కారణమంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో ఉండగానే, హరీశ్‌రావు, రాధాకిషన్ హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసులో ఏ3గా వంశీకృష్ణ, ఏ4గా సంతోష్ కుమార్, ఏ5 పరశురాములను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు జుడీషియల్కస్టడీకి పంపింది. అనంతరం బెయిల్ పై గత నెల 21న విడుదలైన వంశీకృష్ణ మీడియా మాట్లాడుతూ తనపై రివేంజ్ తీసుకుంటానని, అతని స్టేట్ మెంట్ ఆధారంగా తనకు హరీశ్‌రావుతో ప్రాణహాని ఉందని చక్రధర్ తాజా ఫిర్యాదులో ఆరోపించారు.
వంశీకృష్ణ సాక్షులను ప్రభావితం చేసేలా కూడా మాట్లాడాడని పేర్కొన్నాడు. దీంతో వంశీకృష్ణ, హరీశ్‌రావు, సంతోశ్‌కుమార్, పరశురాములపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో హరీశ్‌రావును ఏ2గా, ఏ1గా వంశీకృష్ణ, ఏ3గా సంతోష్‌కుమార్, ఏ4గా పరుశురాములపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.