అదానీ విల్‌‌మార్..   రెవెన్యూ రూ.55 వేల కోట్లకు

అదానీ విల్‌‌మార్..   రెవెన్యూ రూ.55 వేల కోట్లకు
  • అదానీ విల్‌‌మార్  రెవెన్యూ రూ.55 వేల కోట్లకు
  • జార్ఖండ్‌‌లోని థర్మల్‌‌ ప్లాంట్‌‌లో 800 మెగా వాట్ల యూనిట్‌‌ను ప్రారంభించిన అదానీ పవర్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌  2022–23 ఆర్థిక సంవత్సరంలో  రూ.55 వేల కోట్ల రెవెన్యూ సాధించింది.  2021–22 లో వచ్చిన రూ.54,213 కోట్లతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ కిందటి ఆర్థిక సంవత్సరంలో 14 శాతం పెరిగింది. ఇడిబుల్ ఆయిల్ బిజినెస్ డల్‌‌‌‌గా ఉన్నప్పటికీ,  ఫుడ్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ  బిజినెస్‌‌‌‌ ఏడాది ప్రాతిపదికన 55 శాతం పెరిగి రూ. 3,800 కోట్లకు చేరుకుందని అదానీ విల్‌‌‌‌మార్ ప్రకటించింది.  ఫుడ్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ సేల్స్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో 40 శాతం పెరిగాయంది.  ‘అంచనాలకు అనుగుణంగానే ఫుడ్ బిజినెస్‌‌‌‌ విస్తరిస్తోంది. సోర్సింగ్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌, బ్రాండ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ వంటి అన్ని సెగ్మెంట్లలో మెరుగవుతున్నం’ అని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  

అదానీ పవర్‌‌‌‌‌‌‌‌..

జార్ఖండ్‌‌‌‌లోని తమ థర్మల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో 800 మెగా వాట్ల యూనిట్‌‌‌‌ను శుక్రవారం ప్రారంభించామని అదానీ పవర్  ప్రకటించింది. 1,600 మెగా వాట్ల యూనిట్‌‌‌‌ కూడా అడ్వాన్స్డ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ఉందని, తర్వలో ఈ యూనిట్‌‌‌‌లో కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్‌‌‌‌ ప్రకారం,  ఈ ప్లాంట్‌‌‌‌ నుంచి 748 మెగా వాట్ల కరెంట్‌‌‌‌ను బంగ్లాదేశ్‌‌‌‌కు 25 ఏళ్ల పాటు కంపెనీ  సప్లయ్ చేస్తుంది.