డ్రగ్స్ అలవాటు లేదు .. గతంలో ఒకసారి తీసుకున్నా: మస్క్​

న్యూఢిల్లీ: గతంలో  ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అంగీకరించారు. అయితే, ఆ తర్వాతి నుంచి మద్యం, డ్రగ్స్ జోలి కి వెళ్లలేదని చెప్పారు. మూడేండ్లు గా తన బాడీలో డ్రగ్స్, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని స్పష్టంచేశారు. 

ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ.. డ్రగ్స్ తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ ల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది. ఈ కథనంపై మస్క్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ ఈ కామెంట్​ చేశారు