న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ కొద్దిగా ఖరీదు కానుంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. వెస్ట్రన్ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని తెలిపారు.
క్రూడాయిల్‌ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారని అన్నారు. పెర్సియన్ గల్ఫ్, రోటర్‌డ్యామ్ నుంచి వస్తున్న క్రూడాయిల్‌పై ఇంకా ఎక్కువ రవాణా ఛార్జీలను వేస్తున్నారని వివరించారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు వెస్ట్రన్ దేశాలు రష్యన్ ఆయిల్‌పై ఆంక్షలు పెట్టాయి. దీంతో ఒకానొక టైమ్‌లో క్రూడాయిల్‌ను బ్యారెల్‌కు 30 డాలర్లకు కూడా రష్యా అమ్మింది. ఇదే టైమ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 80 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. తక్కువ రేటుకే ఆయిల్ దొరకడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దేశ ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 2 శాతం కంటే తక్కువ ఉండగా, కిందటి నెలలో ఈ నెంబర్ 44 శాతానికి పెరిగింది. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్‌గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని ఎనలిస్టులు చెబుతున్నారు.