ఇండియన్ మార్కెట్ల వైపు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు

ఇండియన్ మార్కెట్ల వైపు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు
  • ఇండియన్ మార్కెట్ల వైపు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు
  • చైనా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకొస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..

న్యూఢిల్లీ: మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐ) భారీగా వస్తున్నాయి. కిందటి నెలలో  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు బాగుండడం, కంపెనీల వాల్యుయేషన్స్ రీజనబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కిందటి నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ నెలలోనూ ఇప్పటి వరకు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. కేవలం రెండే ట్రేడింగ్ సెషన్లలో నికరంగా రూ.6,490 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

జీడీపీ డేటా మెరుగ్గా ఉండడం, ఇతర ఎకనామిక్ ఇండికేటర్లు స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డవ్వడంతో జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతాయని జియోజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు నికరంగా రూ.11,630 కోట్లను, మార్చిలో రూ. 7,936 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మార్చిలో వచ్చిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీక్యూజీ చేసిన పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయి.

ఈ  ఏడాది మొదటి 2 నెలల్లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.34 వేల కోట్లను వెనక్కి తీసుకున్నారు.  ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు చైనా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నికర అమ్మకందారులుగా కొనసాగుతుండగా, ఇండియాలో మాత్రం నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు కిందటి నెలలో డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.3,276 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.