ఎల్‌‌‌‌‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ లాభం 1,151 కోట్లు

ఎల్‌‌‌‌‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ లాభం 1,151 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసెస్ కంపెనీ  ఎల్‌‌‌‌‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీకి ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో రూ.1,151 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. కిందటేడాది క్యూ1 లో వచ్చిన రూ.1,106 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ 14 శాతం ఎగిసి రూ.8,702 కోట్లకు చేరుకుంది. కంపెనీ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ రెండూ కూడా ఎనలిస్టుల అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. క్యూ1 లో ఎల్‌‌‌‌‌‌‌‌టీఐమైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ రూ.1,194 కోట్లుగా ఉంటుందని, రెవెన్యూ రూ.8,770 కోట్లు వస్తుందని ఈటీ నౌ పోల్‌‌‌‌‌‌‌‌ అంచనావేసింది. నిలకడైన కరెన్సీ దగ్గర కంపెనీ రెవెన్యూ కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 లో 8 శాతం పెరిగింది. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ (బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐ), మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌, రిసోర్సెస్‌‌‌‌‌‌‌‌, హైటెక్‌‌‌‌‌‌‌‌, మీడియా, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లు మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. ఈ సెగ్మెంట్ల నుంచే తమకు 75 శాతం రెవెన్యూ  వస్తోంది’ అని ఎల్‌‌‌‌‌‌‌‌టీఐమైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ సీఈఓ దేవాశిష్​ ఛటర్జీ అన్నారు. క్యూ1 లో కంపెనీ రూ.1,635 కోట్ల ఇబిటా (ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు కట్టకముందు వచ్చిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌) వచ్చిందని, ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 9 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానమని వివరించారు.

 కానీ, ఇబిటా మార్జిన్ మాత్రం 19.5 శాతం నుంచి 18.8 శాతానికి తగ్గిందని చెప్పారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే, కంపెనీ రెవెన్యూ కేవలం 0.1 శాతం మాత్రమే పెరిగింది. ఇండస్ట్రీ పరంగా చూస్తే బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఐ సెగ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూ  ఇయర్ ఆన్ ఇయర్ పరంగా 12 శాతం, టెక్‌‌‌‌‌‌‌‌, మీడియా, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ ఒక శాతం వృద్ధి సాధించాయి. నార్త్‌‌‌‌‌‌‌‌ అమెరికా నుంచి వచ్చే రె వెన్యూ 10 శాతం పెరిగిందని, యూరప్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే రెవెన్యూ 7 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే రెవెన్యూ క్యూ1 లో 2.6 శాతం తగ్గిందని తెలిపింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  19 మంది క్లయింట్లను యాడ్ చేసుకున్నామని ఎల్‌‌‌‌‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ ప్రకటించింది. దీంతో   మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 723 కి చేరుకుందని తెలిపింది. క్యూ1 లో ఏకంగా  1.41 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ సాధించింది. కంపెనీ ఉద్యోగులు క్యూ1 లో 84,546 గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 82,738 గా రికార్డయ్యింది. అట్రిషన్ రేట్‌‌‌‌‌‌‌‌ (ఉద్యోగులు జాబ్ మానేయడం) జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17.8 శాతంగా నమోదయ్యిందని, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20.2 శాతమని ఎల్‌‌‌‌‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ తెలిపింది.  రిజల్ట్స్ నేపథ్యంలో కంపెనీ షేరు సుమారు ఒక శాతం పెరిగి రూ.5,140 దగ్గర సెటిలయ్యింది.

ALSO READ:పతంజలిలో ఇన్వెస్ట్ చేసిన అదానీ ఇన్వెస్టర్‌‌‌‌

ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ కి మరో కొత్త ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఇంజినీరింగ్ కంపెనీ ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టీ  వాటర్ అండ్ ఎఫ్లూయంట్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో మరో పెద్ద ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సరికొత్త వాటర్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తుండగా, ఇందుకు కోసం ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ పనిచేయనుంది. బాలియా, ఫిరోజ్‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లోని గ్రామాలకు వాటర్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ను   నిర్మించనుంది. కానీ, ఆర్డర్ విలువ  ఎంతో మాత్రం కంపెనీ బయటపెట్టలేదు.  కంపెనీ క్లారిఫికేషన్ ప్రకారం, రూ.2,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల మధ్య వాల్యూ ఉన్న ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు భారీ ఆర్డర్లు.