ఇండియా నుంచి రూ. 15 వేల కోట్ల   కాంపోనెంట్లు కొనేందుకు టెస్లా ప్లాన్

న్యూఢిల్లీ: మన దేశం నుంచి ఈ ఏడాది రూ. 15,757 కోట్ల  (1.9 బిలియన్​ డాలర్ల)  విలువైన కాంపోనెంట్స్​ను సేకరించాలని టెస్లా ప్లాన్ చేస్తున్నట్లు కామర్స్​ మినిస్టర్​ పీయూష్​ గోయెల్​ వెల్లడించారు. అంతకు ముందు ఏడాది ఈ కంపెనీ ఇండియా నుంచి రూ. 8,300 కోట్ల (బిలియన్​ డాలర్ల) విలువైన కాంపోనెంట్స్​ను సేకరించిందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ డిమాండ్​ భారీగా పెరగనుందని, ఫలితంగా ఆ సెక్టర్​లో ఎక్కువ గ్రోత్​ సాధ్యమవుతుందని చెప్పారు.

ALSO READ: ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలి: తెలంగాణ వైద్యుల సంఘం

ఏసీఎంఏ యాన్యువల్​ సెషన్​లో పీయూష్​ గోయెల్​ మాట్లాడారు. టెస్లాకు మన దేశం నుంచి  కాంపోనెంట్స్​సప్లయ్​ చేస్తున్న కంపెనీల జాబితా తమ వద్ద ఉందని మినిస్టర్​ పేర్కొన్నారు. మన దేశం ఆకర్షణీయంగా ఉండటం వల్లే గ్లోబల్​ కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయని చెప్పారు. గ్లోబల్​ కంపెనీల  చైనా ప్లస్​ వన్​ స్ట్రేటజీ గురించి అడిగిన ప్రశ్నకు పై విధంగా ఆయన స్పందించారు.

 

ALSOREAD: ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎవరు?..  ఇవాళ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శ్రీలంక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చైనా ప్లస్​ వన్​ థీరీని తాను అంగీకరించనని, మన దేశాన్ని ఆ థియరీ నడిపించడం లేదని గోయెల్​ స్పష్టం చేశారు. మన దేశం తన సొంత కాళ్లపై నిలబడుతోందని పేర్కొన్నారు.  ఇన్వెస్ట్​మెంట్​, ట్రేడ్​ అంశాలలో మన దేశం ప్రపంచ దేశాలకు తగిన అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. ఇండియాలో మంచి బిజినెస్​ ఎన్విరాన్​మెంట్​, స్కిల్స్​, మేనేజీరియల్​ టాలెంట్​, బిగ్​ మార్కెట్​తోపాటు, 140 కోట్ల మంది నుంచి వచ్చే డిమాండ్​ ఉన్నాయని వివరించారు.