తెలంగాణలో మావోయిస్టు కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం (అక్టోబర్17) మహిళా మావోయిస్టు సుజాతను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలోని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వస్తుండగా పక్కా సమాచారంతో సుజాతను పోలీసులు పట్టుకున్నారు. సుజాత మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉంది. మహబూబ్ నగర్కు చెందిన కల్పన అలియాస్ సుజాతను పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు సుజాత.