
మహాత్మా జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ గురుకుల పాఠశాలల్లో 2024-–25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6, 7, 8వ తరగతుల్లోని ఖాళీ సీట్లు భర్తీ కానున్నాయి. అర్హులైన తెలంగాణకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథ బాలబాలికలు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు : విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022–-23 లేదా 2023-–24 విద్యా సంవత్సరం లో విద్యను అభ్యసించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000కు మించకూడదు.
వయోపరిమితి : 31-ఆగస్టు 2024 నాటికి ఆరో తరగతికి పన్నెండేళ్లు; ఏడో తరగతికి పదమూడేళ్లు; ఎనిమిదో తరగతికి పధ్నాలుగేళ్లు మించకూడదు.
సెలెక్షన్ : ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 3న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.