ఆదివాసీలను ముంచుతున్న పోలవరం

భద్రాచలం, వెలుగు:  పోలవరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ ఆదివాసీలను ముంచుతోందని భూహక్కుల పరిరక్షణ సమితి వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్​ హాల్​లో  నిర్వహించిన రౌండ్​ టేబుల్​ మీటింగ్​లో సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయవాది పి. నిరూప్​, సీనియర్​ జర్నలిస్టు పాశం యాదగిరి, మట్టిమనిషి పాండురంగారావు, కరుణాకర్​రెడ్డి, మల్లెల రామనాథం, చల్లగుల్ల నాగేశ్వరరావు, తిప్పన సిద్దులు, కవి మల్యాశ్రీ  పాల్గొని పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల 280 గిరిజన గూడేలు జలసమాధి అవుతున్నాయన్నారు.  పునరావాసం కల్పించడంపై పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 


అయోధ్య రామాలయం గురించి పట్టించుకునే పాలకులు భద్రాద్రి రాముడిని విస్మరించడం దారుణమన్నారు.  యునెస్కో దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీలను, భద్రాచలాన్ని కాపాడుకుంటామని వక్తలు ప్రకటించారు. సమావేశంలో విద్యార్థి నేతలు రాజేంద్రప్రసాద్​, బండి కిరణ్​కుమార్​, ఆదివాసీ నాయకులు పూనెం కృష్ణ దొర, ముర్ల రమేశ్​​, పాయం సత్యనారాయణ, సోయం కన్నారావు, కోట దేవదానం   తదితరులు పాల్గొన్నారు.