
- అభివృద్ధి చేయలేదని నిలదీసిన కొండారెడ్డిపల్లి వాసులు
జోగిపేట, వెలుగు : ప్రచార ఘట్టం ముగిసే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ కు చేదు అనుభవం ఎదురైంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల పరిధిలోని కొండారెడ్డి పల్లిలో ప్రజలు ఎదురుతిరగడంతో ఆయన వెనుదిరగక తప్పలేదు. జోగిపేటలో ప్రచారం ముగించుకొని కొండారెడ్డిపల్లికి రాగా పెద్దసంఖ్యలో గుమిగూడిన గ్రామస్తులు, కొందరు కాంగ్రెస్లీడర్లు ఆయనను నిలదీశారు. పాదయాత్రగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా యువకులు అడ్డుకున్నారు.
పోతిరెడ్డిపల్లి నుంచి కొండారెడ్డిపల్లికి రోడ్డు సంగతి ఏమైందని ప్రశ్నించరు. అభివృద్ది చేయనిది ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. దళతబంధు పథకం బీఆర్ఎస్కార్యకర్తలకే పరిమితమైందన్నారు. వీరిని డీసీసీబీ మాజీ డైరెక్టర్, జడ్పీ చైర్పర్సన్మంజుశ్రీ భర్త జైపాల్‌రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ఫైర్అయ్యారు. అడ్డువచ్చిన ఆయనను నెట్టివేసినంత పని చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా క్రాంతికిరణ్ తో పాటు జైపాల్‌రెడ్డి వాహనం ఎక్కి వెనుదిరిగారు.