స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ భారీగా నష్టాలను చవిచూసింది..ఇన్ఫోసిస్ ఫౌండర్ సీఈవో నారాయణమూర్తికి కుటుంబం షేర్లు 6శాతం క్షీణించడంతో సంపద ఒక్కసారిగా కుప్పకూలింది. దాదాపు 1850 కోట్లు సంపద ఆవిరయ్యింది.
రిపోర్టుల ప్రకారం..ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి ఫ్యామిలీ 4.02 శాతం వాటా కలిగి ఉంది. అనగా 32వేల 152 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో1850 కోట్ల క్షీణత నమోదు కావడంతో నారాయణమూర్తి కుటుంబ సంపద 30వేల 300కోట్లకు చేరింది.
2024 ఫైనాన్షియల్ ఇయర్ రెండో త్రైమాసికం ప్రకారం.. ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి ఫ్యామిలీకి 0.40 వాటా ఉంది. ఆయన భార్య సుధామూర్తి 0.92 శాతం వాటా, కొడుకు రోహన్ మూర్తి వాటా 1.62 శాతం, కూతురు, అల్లుడు అక్షతమూర్తి, రిషీ సునక్ లు 1.04 శాతం వాటాలను కలిగి ఉన్నారు. వీరితోపాటు ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి 0.40 శాతం వాటా ఉంది.
Also Read : కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం10 శాతం
అయితే శుక్రవారం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుటుంబం షేర్లు భారీగా నష్టాలను చవి చూశాయి. గురువారం 32వేల 152 కోట్లు ఉన్న ఫ్యామిలీ సంపద మరుసటి రోజు బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ లో ఇన్ఫోసిస్ షేర్లు 5.89 శాతం పడిపోయిన తర్వాత 30వేల 300 లకు తరిగిపోయింది.
ఇన్ఫోసిస్ షేర్ల పతనం ఇతర ఐటి కంపెనీల స్టాక్‌లను కూడా ప్రభావితం చేసింది. కంపెనీ క్యూ3 ఫలితాల్లో సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ ఆరు నెలల లాభాలను 5.42 శాతానికి తగ్గించాయి.