- బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు
జైపూర్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన బీఆర్ఎస్ లీడర్‌పై మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వంశీకృష్ణ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మంచిర్యాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గోగుల రవీందర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వైరల్ చేశాడు. ఈ విషయంపై స్థానిక అడ్వకేట్ రజనీకాంత్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. రవీందర్‌ను అరెస్ట్ చేశారు. రవీందర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్ వెల్లడించారు.