ఇందల్వాయి, వెలుగు : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కమీషన్లు, నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని బీజేపీ రూరల్ ఇన్చార్జి కులాచారి దినేశ్ ఆరోపించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ఇందల్వాయి, ధర్పల్లి ప్రధాన రహదారిపై దెబ్బతిన్న ప్రాంతాల్లో మంగళవారం ఆయన తాత్కాలిక రిపేర్లు చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్ రోడ్డుపై తారు రోడ్డు వేయడంతో వర్షానికి కొట్టుకుపోయిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గద్దె భూమన్న, పద్మరెడ్డి, రాజన్న, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.