మంచిర్యాల/జైపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్బదావత్ సంతోష్ సూచించారు. గురువారం జైపూర్ మండలం ఇందారం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్పోస్టును డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, మంచిర్యాల ఆర్డీవో రాములుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రిజస్టర్లు, రికార్డులను పరిశీలించారు. చెక్ పోస్టుల దగ్గర అన్ని వెహికల్స్ను చెక్ చేయాలని.. ఆధారాలు లేని నగదు, బంగారం, ఇతర సామాగ్రి పట్టుబడితే సీజ్ చేయాలన్నారు. మంచిర్యాల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను డీసీపీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు.